ALERT: రేపటి నుంచి పెరగనున్న ఎండలు
TG: రాష్ట్రంలో ఇప్పటికే ఎండలు దంచికొడుతున్నాయి. అయితే రేపటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని ఐఎండీ అధికారి శ్రీనివాస్ రావు హెచ్చరించారు. ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. దీంతో ప్రజలు మధ్యాహ్నం సమయంలో బయటకు రావొద్దని సూచించారు.