VIDEO: జోరుగా కురిస్తున్న వర్షం

ELR: నూజివీడు పట్టణంలో శనివారం జోరుగా వర్షం కురిసింది. ఉదయం నుండి వేసవిని తలపిస్తూ వచ్చిన ఎండతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అనుకోని రీతిగా ఉరుములు మెరుపులతో కురిసిన వర్షం పట్టణ ప్రజలకు ఉక్క పోత నుంచి ఉపశమనం కలిగించింది. ఆగస్టు మాసంలోనూ సరైన వర్షాలు లేక వ్యవసాయం పూర్తిగా కుంటుపడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.