గ్యాస్ కష్టాలకు చెక్.. కేంద్రం GOOD NEWS
వంట గ్యాస్ కొరతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. LPG ఉత్పత్తిని 25% పెంచామని, ఇకపై బుక్ చేసిన 2.5 రోజుల్లోనే సిలిండర్ డెలివరీ అవుతుందని తెలిపింది. హర్మూజ్ జలసంధి కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో చమురు దిగుమతి చేస్తున్నామని, గతంలో కంటే ఎక్కువే సేకరించామని వెల్లడించింది. త్వరలో రెండు భారీ LNG కార్గోలు భారత్‌కు రానున్నాయని, గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి వస్తుందని చెప్పింది.