రేపు మైదుకూరులో తిరుమల పరిరక్షణ కోరుతూపూజలు
KDP: తిరుమల తిరుపతి దేవస్థానం పరిరక్షణ కోరుతూ శనివారం మైదుకూరు సమీపంలోని నంద్యాల రోడ్డు శ్రీనగరం వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి పూజలు చేయనున్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు.