వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన
MDK: తూప్రాన్ మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక-99 రోజుల కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అభివృద్ధి కార్యక్రమాలపై సర్పంచులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఎంపీడీవో సతీష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి జడ్పీ సీఈవో ఎల్లయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శాఖల వారీగా అభివృద్ధిని వివరిస్తూ, నిర్వహించే కార్యక్రమాలను సర్పంచ్‌లకు తెలిపారు.