నేడే ఫలితాలు.. పిల్లలపై ఓ కన్నేయండి..!
PPM: ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో కొంత మంది విద్యార్థులు తక్కువ మార్కులు వచ్చాయని, పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని మనస్థాపం చెంది క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. తల్లిదండ్రులూ.. రిజల్ట్స్ ఎలా ఉన్నా వారికి మనోధైర్యాన్ని ఇవ్వండి. మార్కులే జీవితం కాదని అండగా నిలవండి. మీ పిల్లలపై ఓ కన్నేసి ఉంచడం ఇంకా మంచిది.