శిథిలావస్థలో పాఠశాల భవనాలు
ASR: డుంబ్రిగుడ మండలంలోని పూలుగుడ, కొంతుగూడ ప్రాథమిక పాఠశాల భవనాలు మరమ్మతులకు గురై అసంపూర్తిగా ఉన్నాయి. పూలుగూడ పాఠశాలలో గోడ పైపెచ్చులు ఊడి పడుతుండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు తెలిపారు. తక్షణమే అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.