VIDEO: అటవీ అధికారులను అడ్డుకున్న గ్రామస్థులు
ASF: చింతలమానేపల్లి మండలం దింద ఫారెస్ట్ భూమిలో నిర్మించిన ఇంటిని సీజ్ చేయడానికి వచ్చిన అధికారులను సోమవారం గ్రామస్థులు అడ్డుకున్నారు. బండేపల్లి బీట్‌లో దాగే సురేశ్ ఇల్లు నిర్మించారు. 3 సార్లు నోటీసులు జారీ చేసినా సమాధానం ఇవ్వకపోవడంతో సీజ్ చేయడానికి వచ్చినట్లు DRO హైమావతి తెలిపారు. సురేశ్ కుటుంబీకులతో పాటు మరో 30 మంది తమను అడ్డుకున్నారన్నారు.