'భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం'
BHNG: కేంద్రంలోని BJP ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి దాని స్థానంలో మనువాద రాజ్యాంగాన్ని తీసుకొచ్చే ప్రయత్నాన్ని అడ్డుకుందామని, CITU జిల్లా అధ్యక్షుడు కోమటిరెడ్డి చంద్రారెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు. ఆదివారం భువనగిరి CITU జిల్లా కార్యాలయంలో నిర్వహించిన "భారత రాజ్యాంగం పరిరక్షణ-సవాళ్ళ"పై సెమినార్‌లో చంద్రారెడ్డి పాల్గొని మాట్లాడారు.