ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

PPM: కురుపాం మండల కేంద్రాల్లో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఉత్సాహంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం పార్టీ అభివృద్ధిపై వీడియోను ప్రదర్శించారు.