రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

TPT: పెళ్లకూరు(M) అక్కగారి పేట సమీపంలోని NH-71 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాళహస్తి నుంచి కొత్తపాలెం వెళ్తున్న వినోద్ కుమార్ (27) బైక్ అదుపు తప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వినోద్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో వెంటనే స్పందించిన 1033 NHAI అంబులెన్స్ సిబ్బంది బాధితుడిని చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.