VIDEO: యదేచ్చగా అక్రమ మట్టి తవ్వకాలు
కృష్ణా: గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో యదేచ్చగా అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్తులు బుధవారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తవ్వకాల కారణంగా భూగర్భ జలాలపై ప్రభావం పడే అవకాశం ఉండడంతోపాటు పర్యావరణానికి నష్టం కూడా సంభవించే ప్రమాదం ఉందని గ్రామస్తులు తెలిపారు. అధికారులు స్పందించి, తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.