ఆ ట్రోల్స్ ఎంతో బాధించాయి: సమీరా రెడ్డి

ఒకప్పుడు అగ్రహీరోల సరసన నటించిన సమీరా రెడ్డి గతంలో తనపై జరిగిన ట్రోల్స్‌పై స్పందించారు. పిల్లలు పుట్టాక విపరీతంగా బరువు పెరిగినట్లు చెప్పారు. ఆ సమయంలో 105 కేజీలు పెరిగానని.. తనను అందరూ ట్రోల్స్ చేశారంటూ భావోద్వేగానికి గురయ్యారు. వాటిని చూసిన తను డిప్రెషన్‌కు వెళ్లినట్లు గుర్తు చేసుకున్నారు.