లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. ఇద్దరికి గాయాలు

KKD: జగ్గంపేట మండలం రామవరం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి వైజాగ్ నుంచి చెన్నై వెళ్తున్న ట్రావెల్ బస్సు లారీని ఢీ కొట్టింది. ఎదుట వెళుతున్న లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 42మంది ఉండగా ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. CI సంఘటనా ప్రదేశానికి చేరుకొని ట్రాఫిక్‌ను నియంత్రించారు.