పేకాట స్థావరంపై దాడులు.. ఆరుగురు అరెస్ట్
GDWL: మానవపాడు మండల పరిధిలోని చంద్రశేఖర్ నగర్‌లో పంట పొలాల్లో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. శుక్రవారం స్థానికుల సమాచారం మేరకు పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 21,500 వేలు, 52 పేకాట ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. నిందుతులపై కేసు నమోదు చేశామని ఎస్సై చంద్రకాంత్ తెలిపారు.