VIDEO: పేరుకే 'నేతి ఇడ్లీ'.. లోపల మాత్రం 'నిల్వ కర్రీలు'

VIDEO: పేరుకే 'నేతి ఇడ్లీ'.. లోపల మాత్రం 'నిల్వ కర్రీలు'

VSP: ఎంవీపీ కాలనీ ఏఎస్ రాజా సర్కిల్ రోడ్డుపై ఉన్న 'చిట్టి చిట్టి నేతి ఇడ్లీలు' బండిపై అధికారులు దాడులు చేశారు. నిల్వ ఉంచిన పన్నీర్, మష్రూమ్ కర్రీలు విక్రయిస్తుండటంతో శానిటరీ ఇన్‌స్పెక్టర్ రవి, షీ టీం రూ.2500 జరిమానా విధించారు. అయితే కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా, ఆరోగ్యంతో చెలగాటం ఆడే నాణ్యత లేని షాపులు మళ్లీ రాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు అన్నారు.