నేడు కలెక్టరేట్‌లో PGRS
అన్నమయ్య: రాయచోటిలోని కలెక్టరేట్‌లో ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించునున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కానీ అర్జీ దారులు మాత్రమే జిల్లా కేంద్రంలో నిర్వహించే PGRSకు రావాలని ఆయన అన్నారు. సమాచారాన్ని తెలుసుకునేందుకు1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని సూచించారు.