VIDEO: జిల్లాలో తప్పిన పెను ప్రమాదం
కర్నూలులో పెను ప్రమాదం తప్పంది. శనివారం రాత్రి పట్టణ సమీపంలోని వెంకాయ పల్లె వద్దనున్న వంతెన వద్ద బైకును నగర పాలక సంస్థకు చెందిన ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్, బైక్ వంతెన పైనుంచి కింద పడిపోయాయి. ఎవరికీ గాయాలు కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాక్టర్ డ్రైవర్ పారిపోయాడని స్థానికులు తెలిపారు.