కాలుష్యంపై అన్ని పార్టీలు కలిసి రావాలి: ప్రియాంక గాంధీ
ఢిల్లీలోవాయు కాలుష్యంపై అన్ని పార్టీలు కలిసి పని చేయాలని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు. ఢిల్లీలో కాలుష్యంపై కేంద్రం తీసుకునే ఏ చర్యకైనా మద్దతు ఇస్తామని తెలిపారు. శ్వాసకోస సమస్యలతో బాధపడేవారు, పిల్లలు, వృద్ధులు ఈ విష వాయువుల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు.