పోయిన హ్యాండ్ బ్యాగ్ బాధితురాలికి అప్పగింత
VZM: కోరుకొండ నుంచి కేఎల్‌పురం వెళ్తున్న సమయంలో మార్గమధ్యలో పడిపోయిన హ్యాండ్ బ్యాగును మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది బాధితురాలికి అప్పగించారు. ఆదిలక్ష్మి అనే మహిళ సోమవారం స్కూటీపై ప్రయాణిస్తుండగా ఆమె హ్యాండ్ బ్యాగు పోయింది. అటుగా వెళ్తున్న సుధీర్ అనే మెడికల్ రిప్రజెంటేటివ్ ఆ బ్యాగును గుర్తించి మహిళా పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.