ఆ రష్యా చమురు నౌకతో మాకు సమస్య లేదు: ట్రంప్‌

ఆ రష్యా చమురు నౌకతో మాకు సమస్య లేదు: ట్రంప్‌

క్యూబా చమురు సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 7.3 లక్షల బ్యారెళ్ల చమురుతో వస్తున్న రష్యా నౌక 'అనాటోలీ కొలోడ్కిన్‌'కు అనుమతినిస్తూ సంచలన ప్రకటన చేశారు. ఆంక్షలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఏ దేశమైనా క్యూబాకు చమురు పంపినా తనకు అభ్యంతరం లేదని, త్వరలోనే అక్కడ ప్రభుత్వం కూలిపోతుందని అన్నారు. దీంతో క్యూబాకు ఒకింత ఊరట లభించింది.