'వేసవిలో పరిశ్రమలు అప్రమత్తంగా ఉండాలి'
SKLM: జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కె. రాంబాబు సోమవారం ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా ఫార్మా, రసాయన పరిశ్రమల్లోని రియాక్టర్లు, స్టోరేజ్ ట్యాంకుల వద్ద ఉష్ణోగ్రతలు పెరగకుండా శీతలీకరణ వ్యవస్థలు నిరంతరం పనిచేసేలా చూడాలని యాజమాన్యాలను ఆదేశించారు.