VIDEO: చెరువును తలపిస్తున్న రహదారులు

GNTR: నగరంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షానికి రహదారులన్నీ జలమయం అయ్యాయి. డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో కాలువలు పొంగిపోర్లాయి. 3 వంతెనల మార్గం మురుగు నీటి చెరువుని తలపించింది. అటుగా వెళ్లే పలు ద్విచక్ర వాహనాల సైలెన్సర్‌లలోకి మురుగు నీరు వెళ్లడంతో మొరాయించాయని వాహనదారులు తెలిపారు.