సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల పేరుతో భారీ మోసం

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల పేరుతో భారీ మోసం

VSP: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన ఘటన పెదవాల్తేరులో చోటుచేసుకుంది.  రాంనగర్లో ఉన్నతిల సంస్థ నిర్వాహకుడు సాయి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని 140 మంది నుంచి రూ.1.50 లక్షల నుంచి 3 లక్షల చొప్పున తీసుకున్నాడని బాధితులు తెలిపారు. కొంతమందితో 2 నెలలు పాటు పని చేయించుకుని వేతనాలు కూడా చెల్లించలేదన్నారు.