రేపు మండల కేంద్రంలో ఉచిత మెగా వైద్య శిబిరం

MHBD: జిల్లా గంగారం మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో రేపు ఆదివారం జరుగు మెగా ఉచిత వైద్య శిబిరము విజయవంతం చేయాలని కోరుతూ జిల్లా ఎస్పీ రామనాధ్ కేకన్ నేడు వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. మండలం నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చి హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ కోరారు.