'ఉపాధి వేతనదారులకు 200 రోజుల పని దినాలు కల్పించాలి'
AKP: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వేతన దారులకు ఏడాదికి కనీసం 200 రోజులు పని దినాలు కల్పించాలని CPM జిల్లా కార్యదర్శి జి. కోటేశ్వరరావు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉపాధి కల్పించేందుకు తీసుకువచ్చిన ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు విమర్శించారు.