'భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

'భారీ వర్షాల పట్ల  ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

SRPT: భారీ వర్షాల నేపథ్యంలో మోతె మండల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ వెంకన్న అన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో విద్యుత్ వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పాత, శిథిలావస్థకు చేరిన ఇళ్లలో నివసించవద్దని, చెరువులు, వాగులు, కుంటలు నిండి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నప్పుడు వాటిని దాటే ప్రయత్నం చేయరాదని ప్రజలకు సూచించారు.