నేటి నుంచి టోల్ ప్లాజాల నగదు చెల్లింపులు నిలిపివేత
ADB: నేటి నుంచి టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులను అధికారులు నిలిపివేశారు. కేవలం ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారానే రుసుము స్వీకరించనున్నారు. నిబంధన ఉల్లంఘించి నగదు ఇచ్చేవారు 1.25 రెట్లు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలోని రోలమామడ, గంజాల్ టోల్ ప్లాజాల వద్ద ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయని అధికారులు తెలిపారు.