వరి ధాన్యం కొనుగోళ్లకు చర్యలు

వరి ధాన్యం కొనుగోళ్లకు చర్యలు

NGKL: జిల్లాలో‌ వరి ధాన్యం కొనుగోళ్లకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. రబీ సీజన్‌లో 1 లక్ష 43 వేల ఎకరాల్లో వరి పంట సాగు జరిగింది. దీంతో సుమారు 4 లక్షల 53 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగిన విధంగా జిల్లాలో మెప్మా,‌ డీఆర్డిఏ, సింగిల్‌విండోల ద్వారా వరి ధాన్యం కొనుగోలు చేపట్టనున్నారు.