అనంతగిరిలో ఎల్పిజి సరఫరా ఆలస్యం

అనంతగిరిలో ఎల్పిజి సరఫరా ఆలస్యం

ASR: అనంతగిరి మండలంలో వంట గ్యాస్ సరఫరాలో తీవ్ర ఆలస్యం చోటుచేసుకుంటోంది. గ్యాస్ బుక్ చేసినప్పటికీ 15 రోజులు గడిచినా సిలిండర్లు అందడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీల నిర్లక్ష్యం, లోడ్ రాకపోవడం పేరుతో డెలివరీ జాప్యం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. బ్లాక్ మార్కెట్‌లో అమ్మకాలు, అదనపు వసూళ్లు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.