యూరియా కోసం బారులు తీరిన రైతులు

యూరియా కోసం బారులు తీరిన రైతులు

KNR: యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. తెల్లారకముందే సహకార సంఘాల ఎదుట భారీగా క్యూలైన్లు కడుతున్నారు. సైదాపూర్ మండల కేంద్రంలోని సహకార సంఘానికి 230 బస్తాల యూరియా వచ్చింది. దీంతో మంగళవారం ఉదయమే భారీ సంఖ్యలో చేరుకున్న అన్నదాతలు క్యూలైన్‌లో తమ వంతుకోసం నిరీక్షిస్తున్నారు. అయితే సిబ్బంది రైతుకు ఒక బస్తా చొప్పున మాత్రమే పంపిణీ చేసినట్లు తెలుస్తోంది.