'రాహుల్ గాంధీ అక్రమ అరెస్టు దుర్మార్గం'

'రాహుల్ గాంధీ అక్రమ అరెస్టు దుర్మార్గం'

ATP: కేంద్ర ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని తమ నాయకుడు రాహుల్ గాంధీని అక్రమ అరెస్టు చేయించడం దారుణమని రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ గౌని ప్రతాపరెడ్డి పేర్కొన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం పిరికి చర్యగా భావిస్తున్నామని అన్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సాక్షాలతో నిరూపించుటకు వెళ్తున్న తమ నేతను అరెస్ట్ చేయించడం దుర్మార్గం అన్నారు.