ఢిల్లీ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ దిగ్భ్రాంతి
AP: ఢిల్లీలో పేలుడు ఘటనపై Dy. CM పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రపంచంలో భారత్ శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా ఎదుగుతున్న సమయంలో.. ఇలాంటి పిరికి చర్యలు దెబ్బతీయలేవని.. ఈ చర్యలు వారికి నిరాశను మాత్రమే చూపిస్తాయన్నారు. ఘటనకు పాల్పడిన వారిని అత్యంత కఠినంగా శిక్షించాలని కోరారు.