కోటి రామాలయం అభివృద్ధి పనులకు శంఖుస్థాపన
E.G: కోరుకొండ మండలం కోటి గ్రామంలో వెలసిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులకు సోమవారం ఘనంగా శంఖుస్థాపన చేశారు. జనసేన పార్టీ 'నా సేన కోసం నా వంతు' రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి విచ్చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.