రూపాయికే బూట్లు.. పోటెత్తిన ప్రజలు
రూపాయికే బూట్లు పంపిణీ చేస్తామంటూ కేరళలోని ఓ దుకాణ యజమాని ప్రకటించాడు. రూపాయి నోటు చూపిన మొదటి 100 మందికి ప్రీమియం బూట్లు ఇస్తామని తెలిపాడు. దీంతో అధిక సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకోవడంతో వారిని అదుపుచేయడం కష్టంగా మారింది. ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు. దుకాణ యజమానిని అదుపులోకి తీసుకున్నారు.