వసతిగృహాన్ని సందర్శించిన కలెక్టర్

వసతిగృహాన్ని సందర్శించిన కలెక్టర్

NZB: బాల్కొండలోని ఆదర్శ పాఠశాల, కళాశాల వసతిగృహాన్ని సోమవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కేర్‌టేకర్‌గా పని చేస్తున్న వీణ తమతో అనుచితంగా వ్యవహరిస్తోందని, రెగ్యులర్‌గా విధులకు హాజరుకావడం లేదని, మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని, తమ బాగోగులు పట్టించుకోవడం లేదని విద్యార్థినులు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు.