దివ్యాంగునికి టచ్ ఫోన్ అందజేసిన కలెక్టర్
PPM: గరుగుబిల్లి గ్రామానికి చెందిన ఎ.అఖిల్ దివ్యాంగుడైన తనకు టచ్ ఫోన్ మంజూరు చేయాలని కోరుతూ సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టరుకు వినతి పత్రాన్ని అందజేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి తక్షణమే స్పందించి, అర్జీదారుడు కోరినట్లుగా టచ్ ఫోన్‌ను అందజేశారు.