నిరుపేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ భరోసా

SRPT: నిరుపేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేటలో 23 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.9,33,500ల చెక్కును అందజేసి మాట్లాడారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు ప్రభుత్వం పెంచిందన్నారు.