జనగణనపై అపోహలు వీడాలి: డీఆర్వో

జనగణనపై అపోహలు వీడాలి: డీఆర్వో

ATP: డిజిటల్ విధానంలో జరిగే జనగణనపై ప్రజలు అపోహలు వీడాలని జిల్లా రెవెన్యూ అధికారి మాలోల స్పష్టం చేశారు. గురువారం అనంతపురంలో ఎన్యూమరేటర్ల శిక్షణ తరగతులను ఆయన పరిశీలించారు. ఈ నెల 16 నుంచి పోర్టల్ ద్వారా స్వీయ గణన చేసుకోవచ్చని, మే 1 నుంచి అధికారులు ఇంటింటికీ వస్తారని తెలిపారు. వివరాల నమోదుకు ఆధార్, పాన్ కార్డులు సమర్పించాల్సిన అవసరం లేదని అన్నారు.