ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీ చేసిన.. DMHO
MHBD: జిల్లా కేంద్రంలోని కీర్తి, శ్రీనివాస ప్రైవేట్ ఆసుపత్రులను మంగళవారం DMHO భూక్య రవి రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, ఆయుర్వేద, యోగా, ఫిజియోథెరపీ కేంద్రాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు. డాక్టర్ల సర్టిఫికెట్లు, వివరాలు అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు.