అహోబిలంలో దర్శనం తాత్కాలికంగా నిలిపివేత

అహోబిలంలో దర్శనం తాత్కాలికంగా నిలిపివేత

NDL: అహోబిలంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ గర్భగుడిని సుగంధ పరిమళాలతో శుద్ధి చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆదివారం మఠం సీఈవో రామానుజన్ తెలిపారు. ఈ క్రమంలో ఎగువ, దిగువ ఆలయాల్లో ఈనెల 17న ఉదయం 10 నుంచి సాయంత్రం 3 గంటల వరకు దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. భక్తులు సహకరించాలని సీఈవో రామానుజన్ కోరారు.