VIDEO: మున్సిపల్ కార్యాలయం ముందు బిందెలతో నిరసన
BHPL: జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ కాలనీకి తాగునీటి సౌకర్యం కల్పించాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇవాళ కాలనీవాసులతో మున్సిపల్ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టారు. గత ఐదు సంవత్సరాలుగా నివసిస్తున్న గుడిసె వాసులకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించాలని సీపీఐ పట్టణ కార్యదర్శి ప్రవీణ్ పేర్కొన్నారు.