ఔటర్ రింగ్ రోడ్డుకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి: కలెక్టర్

ఔటర్ రింగ్ రోడ్డుకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి: కలెక్టర్

KRNL: ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు కర్నూలు శివారులోని పెద్దపాడు నుంచి 44వ జాతీయ రహదారి హైదరాబాద్‌ను లింకు చేసే విధంగా ఔటర్ రింగ్ రోడ్డుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ పి. రంజిత్ భాషా ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశహాలులో ఎస్పీతో కలిసి రోడ్ సేఫ్టీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఉల్చాల రోడ్డు సర్కిల్ పనులు వేగవంతం చేయాలన్నారు.