హాజీపూర్‌లో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదు

హాజీపూర్‌లో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదు

మంచిర్యాల జిల్లాలో జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 4 మండలాల్లో మొత్తంగా 1,19,700 మంది ఓటర్లకు గాను 95,810 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 80.04శాతం పోలింగ్ నమోదైంది. హాజీపూర్ మండలంలో అత్యధికంగా 85.05శాతం . లక్సెట్టిపేటలో 82.34 శాతం పోలింగ్ నమోదైంది. దండేపల్లిలో 79.98శాతం పోలింగ్ శాతం, జన్నారంలో 76.80 పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.