రాజలింగాలలో పోషణ పక్వాడ అవగాహన
KMM : ఏన్కూర్ మండలం రాజలింగాల అంగన్‌వాడీ కేంద్రాల్లో గురువారం 8వ పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ ధనసరి నవీన్ ముఖ్య అతిథిగా హాజరై, గర్భిణులు, చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ భవాని మాట్లాడుతూ.. అంగన్‌వాడీ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.