'దివ్యాంగ శక్తి' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
VSP: మధురవాడ ఆర్టీసీ డిపోలో ఇవాళ నిర్వహించిన 'దివ్యాంగ శక్తి' కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు ఉచిత ఆర్టీసీ బస్సు కార్డులను అందజేశారు. అనంతరం దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు.