మానవపాడుకు చెందిన వ్యక్తికి డాక్టరేట్

GDWL: మానవపాడు మండలం అమరవాయికి చెందిన డాక్టర్ రవికుమార్ హైదరాబాద్‌లో జరిగిన కాన్వకేషన్ వేడుకల్లో ఇస్రో ఛైర్మన్ నారాయణ చేతుల మీదుగా మంగళవారం డాక్టరేట్ పట్టా అందుకున్నారు. పాలమూరు యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ విభాగంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న రవికుమార్, ఇస్రో ఛైర్మన్ చేతుల మీదుగా ఈ సర్టిఫికెట్ అందుకోవడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.