పోతంగల్ కుర్దూ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

KMR: గాంధారి మండల కేంద్రంలోని పోతంగల్ కుర్దూ గ్రామంలోనీ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కేంద్రంలో నేడు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు ఉత్నూర్ PHC వైద్యాధికారి డాక్టర్ సాయికుమార్ తెలిపారు. ఈ శిబిరంలో గ్రామంలోని ప్రజలందరికీ ఉచితంగా వైద్య సిబ్బంది ద్వారా వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో పరిశుభ్రతపై అవగాహన కల్పించినట్లు తెలిపారు.