VIDEO: వైద్యం వికటించి మహిళ మృతి.. రోడ్డుపై బంధువుల ఆందోళన

VIDEO: వైద్యం వికటించి మహిళ మృతి.. రోడ్డుపై బంధువుల ఆందోళన

MBNR: జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి వైద్యం వికటించి లలిత అనే మహిళ మృతి చెందడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జ్వరం రావడంతో మేనక టాకీస్ సమీపంలో ఉన్న ఆసుపత్రికి తీసుకురాగా, మొదట అంతా బాగానే ఉందని చెప్పారు. కానీ, వెంటనే ఆమెను ఐసీయూలోకి మార్చి, కాసేపటికే మరణించిందని డాక్టర్లు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.