ఈనెల 23న 'శాప్ లీగ్స్' పోటీలు
శ్రీకాకుళంలో 'శాప్ లీగ్స్' ఫుట్‌బాల్, బాక్సింగ్ పోటీలలో జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి మహేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23న నగరంలోని కోడి రామమూర్తి స్టేడియంలో ఎంపికలు జరుగుతాయన్నారు. ఇందులో ఎంపికైన క్రీడాకారులకు ఈనెల 28న జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందన్నారు.